Posts

సమస్య మనది -- సలహా గీతది -- 14

  సమస్య మనది -- సలహా గీతది -- 14  https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/12/14.html నేను కొత్తగా ఒక పరిశ్రమను ఏర్పాటుచేయ దలచుకొన్నాను. ఎన్నో ఆలోచనలు ఎన్నో భయాలు. అసలు మొదలు పెడదామా వద్దా అన్న సందేహాలు. ఎటూ తోచని స్థితి. ఏమి చేయవలెనన్నది నా ఆందోళన.   సలహా : ‘శ్రేయాంసి బహువిఘ్నాని’ అన్నమాట సామాన్యముగా నీవు వినే ఉంటావు. ఆ వాక్యమును కలిగిన శ్లోకము యొక్క పూర్తి పాఠము ఇది. శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహాతామపి అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాన్తి వినాయకాః మంచి వారు మంచి పనినే తలపెడుతారు. తలపెట్టిన పని మంచిదయితే దానికి ఆటంకాలు కోకొల్లలు. అదే దుష్టులు తలపెట్టే దుష్కార్యములు నిరాటంకముగా జరిగి పోతాయి. దుష్కార్యము తలపెట్టేవాడు దుష్టుడు కాక మరేమౌతాడు. నాటి కాలములో పల్లెటూరి వాతావరణము కలిగిన చలన చిత్రాలలో ANR లాంటి హీరోలు జనాన్ని కలుపుకొని తమ పొలాలకు నీరు వచ్చేలాగు కష్టపడి ఏర్పాటు చేసుకొంటే ఏ రౌడి రాజనాలో వచ్చి ఆ జలాశయానికి    గండి కొడతాడు. కథ ఇక్కడ ఆపేద్దాము. ఒక మంచి పని చేయుటకు ఎంతోమంది చేయూతతోకూడిన   ఎంతో కష్టము ఒక్కటయితే తప్ప నీటిని పొలాలకు ...

సమస్య మనది -- సలహా గీతది – 13

సమస్య మనది -- సలహా గీతది – 13 https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/12/13.html నేను ఆదర్శవాదిని. సమాజమునకు నిజమైన సేవకునిగా కొంత గుర్తింపు లభించింది. ఈర్ష్యతో నన్ను వేలెత్తిచూపేవారు ఎక్కువైనారు.ఈ అప్రతిష్ఠ భరించలేకున్నాను. కిం కర్తవ్యమ్ ? నీ మనసు నీ కర్మలకు కోర్కెలకు కర్మాగారము. బుద్ధి దాని బంటు. ఆత్మ కేవలము సాక్షి . త్రవ్వదు , పూడ్చదు కానీ అనవరతము మనసు చేసే మంచిచెడులకు సాక్షీభూతమై ఉంటుంది. అంటే మన కరణమునకు అంటే చేసే పనికి అది ప్రత్యక్ష సాక్షి. దానికి తెలియకుండా ఏదీ జరుగదు. నీ పనిలో నిజాయితీ ఉందన్న నమ్మకము నీ బుద్ధికి కలిగినపుడు నీవు వెనుకంజ వేయనవసరములేదు. నీ చేష్ఠ సమాజ శ్రేయస్సుకు ఉపకరించేదైతే నీవు మెడిమె త్రిప్పనవసరమే లేదు. ఆ విధమైన జ్ఞానమే నీ బాటకు వెలుగు . గాఢాంధకారము అలముకొన్నా సరే అడుగు ముందునకు మాత్రమే వేయి. అట్లని' కళ్ళుమూసుకొని ' అని మాత్రము కాదు ఆచి తూచి అడుగు వెయ్యమని అర్థము. భర్తృహరి సుభాషితము ఏనుగు లక్ష్మణ కవి మాటలలో : ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ...

సమస్య మనది -- సలహా గీతది -- 12

  సమస్య మనది -- సలహా గీతది -- 12   https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/11/12.html సమస్య    :అధర్మం పెరిగిపొతూంది. అకారణ వైరాలు పెరిగిపోతున్నాయి. తాము చీకాకు పడి లోకాన్ని కూడా చీకాకు పెడుతున్నారు. బాధ్యతను భరించి నిలువడమా    లేక బాధ్యతకు భయపడి పారిపోవడమా   ?   సలహా : దేనికయినా ఒక స్థితిస్థాపకత ( Extreme Elastic Nature, Breaking Stress)   వుంటుంది. పరిస్థితులు    ఆ తటమును చేరినపుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుటకు తానె పుడతానన్నాడు పరమాత్మ. కావున ఆభారము ఆయనపైన వేసేస్తే సరిపోతుంది. ఇక చీకాకు విషయమునకొస్తే రాత్రి సమయములో వెలిగే వీధి దీపాలు గుర్తుకు వస్తాయి నాకు. ఎందుకంటే పగలు ముగియగానే చీకటి రాను రానూ దట్టముగా అలముకోనుట ప్రారంభామవుతూ వస్తుంది .   ఆ సమయములో వీధి దీపములు వెలుగుట ప్రారంభమౌతుంది. అన్నీ వెలిగినాయనుకో వీధి మొత్తము వెలుగుతో నిండి నడచుటకు ఆటంకము లేకుండా చేస్తుంది. చెదురు మదురుగా కొన్ని దీపములు వెలుగలేదనుకో    ఆ ప్రదేశము న మసక చీకటి ఆవహించుతుంది. నడచేవాని నడక వేగమూ తగ్గుతుంది. దీనివలన మనకు...

సమస్య మనది -- సలహా గీతది -- 11

  సమస్య మనది -- సలహా గీతది -- 11   https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/10/11.html సమస్య : పంచ భూతాలయిన   పృథివ్యాపస్తేజో వాయురాకాశములు   విజృంభించితే మన పని అంతే !   సలహా   : అదే మూర్ఖత్వమంటే ఇంత వరకూ విన్నదంతా పొట్టులా గాలికి కొట్టుకు పోతే , రెడ్డి గారొచ్చినారు మళ్ళీ మొదలెట్టం డన్న చందము అయినది. ఒక చిన్న కథ గుర్తుకు వస్తూవుంది. ఒక పల్లెటూరిలో ఇద్దరు ప్రక్క ప్రక్క ఇంటి స్నేహితులు రోజూ పశువుల మేపను ప్రొద్దుటే పోయి చీకటి ప్రోద్దుకు తిరిగి వచ్చే వారు. ఇంటికి వచ్చి సేద తీర్చుకొని స్నానము చేసి భోజనము చేసి నిడురించేవారు. వీరి చేతిలో ఎప్పుడూ ఒక పొడవాటి కట్టె శరీరము పై కప్పుకోనేందుకు ఒక కంబడి వెంబడి ఉండేది. ఒకరోజు రాత్రి   ఇద్దరూ తమ కట్టె కంబడి సమేతముగా   భోజనాదులు ముగించుకొని వచ్చి పడుకొన్నారు , ఇంటిబయట వేసిన మంచాలపై. రెండవానికి నిదుర పట్టింది కానీ మొదటివాడు తన యింటికి చాలా దగ్గరలో ఎదో హడావిడి గమనించినాడు . తన కట్టె కంబలితో లేచినాడు . ఎవరో పండితుడు రామాయణము చెబుతున్నాడని విన్నాడు   కానీ తానూ కూర్చుంటే చెప్పే వ్యక్తీ కనబడదు కా...

సమస్య మనది -సలహా గీతది -- అనుబంధము (annex)

  సమస్య మనది -సలహా గీతది -- అనుబంధము ( annex) https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/10/annex.html నిన్నటిరోజు ఒక పాఠకురాలు   ' సమస్య మనది -సలహా గీతది --   10'   అన్న విషయము చదివి ఒక సందేహము వేలిబుచ్చినది. ఆత్మ ఒక చొక్కావిడిచి వేరొక చొక్కా తోడుగుకోనేటపుడు ఈ కర్మ కాండ అవసరము లేదుకదా అని. నాకు తెలిసినమేరకు   ,   అందుకు సమాధానముగా ఈ మాట వ్రాస్తూవున్నాను. నాలోని అజ్ఞత ఏదయినా వుంటే మన్నిప వేడ్కోలు. అమ్మా చాలాకాలం పాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు. ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం. చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపులనుంచి ముడుచుకుపోయి మస్తిష్కంలో ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ , మనస్సునూ ,   బుద్ధిని కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" అది వాయువులో లీనమానది కావున దేనినీ ఆశ్రయించకుండా కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని ని...