సమస్య మనది -- సలహా గీతది – 13
సమస్య మనది -- సలహా గీతది – 13
https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/12/13.html
నేను ఆదర్శవాదిని. సమాజమునకు నిజమైన సేవకునిగా కొంత గుర్తింపు లభించింది. ఈర్ష్యతో నన్ను వేలెత్తిచూపేవారు ఎక్కువైనారు.ఈ అప్రతిష్ఠ భరించలేకున్నాను. కిం కర్తవ్యమ్ ?
నీ మనసు నీ కర్మలకు కోర్కెలకు కర్మాగారము. బుద్ధి దాని బంటు. ఆత్మ కేవలము సాక్షి . త్రవ్వదు , పూడ్చదు కానీ అనవరతము మనసు చేసే మంచిచెడులకు సాక్షీభూతమై ఉంటుంది. అంటే మన కరణమునకు అంటే చేసే పనికి
అది ప్రత్యక్ష సాక్షి. దానికి తెలియకుండా ఏదీ జరుగదు. నీ పనిలో నిజాయితీ ఉందన్న నమ్మకము నీ బుద్ధికి కలిగినపుడు నీవు వెనుకంజ వేయనవసరములేదు. నీ చేష్ఠ సమాజ శ్రేయస్సుకు ఉపకరించేదైతే నీవు మెడిమె త్రిప్పనవసరమే లేదు. ఆ విధమైన జ్ఞానమే నీ బాటకు వెలుగు . గాఢాంధకారము అలముకొన్నా సరే అడుగు ముందునకు మాత్రమే వేయి. అట్లని' కళ్ళుమూసుకొని ' అని మాత్రము కాదు ఆచి తూచి అడుగు వెయ్యమని అర్థము. భర్తృహరి సుభాషితము ఏనుగు లక్ష్మణ కవి మాటలలో :
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ద్రుత్యోన్నతోత్సాహులై
ప్రారభ్దార్థము నుజ్జగించరు సుమీ ప్రాజ్ఞానిదుల్ గావునన్
ధీరుడు ఏమైయితే అది గానీ (come what may ) అని తన పని కొనసాగించుటయేగాక దానిని పూర్తిచేయువరకు వదలడు.
తిండి నలుసు బట్టి తిరముగ గోడపై
పడుచు లేచి చీమ ప్రాకుచుండు
అట్టి చీమ నెప్పు డాదర్శముగా నెంచు
రామ మొహనుక్తి రమ్య సూక్తి
ఇంకొక విషయము. నీపైన ఈర్ష్య వున్నవారు ఎందరయినా ఉండనీ. నీలో ఈర్ష్య లేకుంటే చాలు. ఈర్ష్య చింతలది విడదీయరాని బంధము. ఒకసారి ఈ మాటను ఆలకించు. చింతకు ఈర్ష్య చేరితే ఏ విధముగా వుంటుంది అన్న ఈ పద్యమును శ్రీనాథులవారు వింధ్యేంద్రుని ద్వారా చెప్పించిన ఈ పద్యము వింటే ఇది భారతములో పరాభవము చెందిన దుర్యోధనుడు కదా ఇది చెప్పినది అనిపిస్తుంది. ఈర్ష్య ఎంతగా వ్యక్తిని వ్యాకులపరుచుతుందో చూడండి.
కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటకమిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యునకెట్టి వానికిన్
గంటకుఁ డైన శాత్రవుఁడొకండు దనంతటి వాఁడుగల్గినన్.
కంటికి నిద్ర రాదట, రతికేళి కూడా సుఖమును కూర్చదట, ఎంత రుచికరమయిన వంట కూడా నోటికి ఇంపితము కాదట, అవి పదివేల విధములగు వైభవములే కానీగాక మనసు ఇష్టపడదట, ఎవరికి, ఎటువంటివానికి అంటే మానవత గల్గిన మనిషికి ఎవనికైనా తనంతటి శత్రువు ఒకడు ఏర్పడినాడంటే వాడు ‘చెప్పులోని రాయి, చెవిలోనిజోరీగ, కంటిలోని నలుసు, కాలిముల్లు కదా’!
ఇది ఈర్ష్య తో కూడిన చింత. ఇది ఇంకా భయంకరమైనది. చూచినావు కదా!
ఈ కథను ఒకసారి గమనించు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరి సంపద చూసి ఇంకొకరికి ఈర్ష్య. దానిచే ఒకనికన్నా ఇంకొకడు అమిత ధనవంతుడు కావలెనను చింత. ఎంతో యోచించి పెద్దవాడు, తపస్సు చేస్తే తనకోరిక సాధించుకోనవంచును అన్న ఆలోచన కలుగుటచేత ఒక కొండగుట్ట చేరి తపమాచరించ మొదలుపెట్టినాడు. ఇది తెలిసిన తమ్ముడు తానూ కూడా అదే పని అదే కొండపై అన్నకు కాస్త దూరములో మొదలుపెట్టినాడు. ఎత్లయితేనేమి దేవుడు ముందు తపస్సు మొదలుపెట్టిన పెద్దవానికి ప్రత్యక్షమై వారము కోరుకొమ్మన్నాడు. వాడు కళ్ళు తెరువగానే దేవునికన్నా ముందు తమ్ముడు తపస్సు చేయుట చూసినవాడై, దేవుని ‘స్వామీ! నీవు ఎటూ ఆ తపస్సు చేసుకొనే వానికి కూడా ప్రత్యక్షమౌతావు కదా! వాడు కోరిన దానికి నాకు రెండితలివ్వు.’ అన్నాడు. పనిలో పనిగా దేవుడు తమ్ముని ఎదుట నిలిచి వారము కోరుకొమ్మన్నాడు. వానికి ‘అన్న’ చింత కదా! ‘వాడేమి కోరినాడ’ని అడిగినాడు. అబద్ధామంటే తెలియని దేవుడు ఉన్నమాట చెప్పినాడు. తమ్ముడు వెంటనే “స్వామీ అట్లయితే నాది ఒక కన్ను గుడ్డి చేయి” అన్నాడు. తక్షణం వీడికి ఒక కన్ను వాడికి రెండుకళ్ళు పోయినాయి. ఈర్ష్య చింత కలిస్తే ఇంత అనర్థము దాపురించుతుంది.
ఈ సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
ఎంతటి వానికైన మది నేర్పడు చింతకు ఊపిరూదుచున్
చెంతన ఈర్ష్య వున్న ఇక చింత దవానలమౌచు రేగి ఏ
పొంతన లేని దుష్టగుణ పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel a Pleasure.
ఈ విషయమై భగవాను డేమి చెబుతున్నాడో చూస్తాము :
అకీర్తించాపిభూతాని కథయిష్యంతి తే'వ్యయాం
సంభావితస్య చాకీర్తి ర్మరణాదతిరిచ్యతే 34-2
పొందిన కీర్తిని పొంగే పాలుగ
పోనీ కయ్యది పొయ్యి పాలుగా
మాన్యత పొందిన మనుజున కెప్పుడు
మరణము కన్నా మారణ మయ్యది 34 - 2
అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః
నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం న కిం 36-2
లోకులెప్పుడూ కాకుల పోలిక
అపవాదుల నీకంకిత మిచ్చి
అప్రతిష్ఠ నీ కంటగట్టుదురు
మాన్యున కయ్యది మరణమే కదా 36 -- 2
ఒకసారి పరమాత్ముని సంభాషణా చాతుర్యమును (conversational skill ) తిలకించు . ఇంతవరకు వేదాంత పరముగా మాట్లాడిన ఆయన ఇంకా అదే మూసలో మాట్లాడితే పరిపక్వత చెందవలసిన నరుడికి అర్థము కాదని తెలిసి ప్రాపంచిక విషయముల పైకి ఆతని దృష్టి మరల్చినాడు. తిరిగీ దీనిని ఎప్పుడో దానికి తగిలించుతాడు. అది ఆయన నేర్పరితనము. మనకు ఎంత తెలుసునన్నది , ఎంతసేపు అనర్గళంగా చెబుతున్నామన్నది ముఖ్యము కాదు. ఎదుటివానికి ఎంత అర్థమైనది అన్నది ముఖ్యము. ఇది grinder యుగము. ఎవరైనా వచ్చి switch off చేస్తే కాని అది రుబ్బుట మానదు. ఇట్లు చేయుట యేవిధమైనటువంటిదంటే నిగనిగలాడే మామిడి పండును రేపు ఇంకా ఎక్కువ ధర కమ్మవచ్చులే అని నాల్గు రోజులు
తనవద్దనే వుంచుకొన్నాడట ఒకడు. ఐదవరోజు అది కుళ్ళిపోయింది. Painkillers పది ఒకేసారి వేసుకొంటే ఇక నొప్పి రాదనుకొనుట తెలివికి తార్కాణము కాదుగదా! పైపెచ్చు భగవానుడు అర్జనుని భరతర్షభ అని సంబోధించుట కూడా కద్దు. అంటే అతని గొప్పదనమును గుర్తుజేసి కార్యోన్ముఖుని జేసే ప్రయత్నము చేస్తున్నాడు. ఈ కాలము లేని విశేషణాలనుకూడా అంటగట్టి ఎదుటివారిని అవసరమున్నా లేకున్నా పొగుడుతూ ఉంటాము. ఆయన ఎంతో విశధముగా " అర్జునా ! నీవు కీర్తి కిరీటివి. కీర్తికే కిరీటము వంటివాడివి లేక కీర్తిని కిరీటముగా కలిగిన వాడివి. ఇప్పుడు నీ బాధ్యత విస్మరించ తగదు. నీవు ఎన్నుకొన్న దారిన ఎంతోదూరము నడచిన పిదప ఇక వెనుదిరగ వీలుకాదు. నీవింతవరకూ అవలంబించినది క్షత్రియ ధర్మ మార్గము. నీవు ముందునకు సాగావలసిందే అని హెచ్చరిక తో కూడిన మాటను ఎంతో మృదువుగా చెప్పుచున్నాడు. కాబట్టి దారి ఎంచుకొనుటలో ఆలస్యము వుండచ్చును గానీ ఆచరించుటకు రంగము సిద్ధమైన తరువాత అమీ తుమీ తెలవలసిందే!
అసందర్భము కాదని తలచుతూ నేను ఆంగ్లములో వ్రాసిన ఈ పంక్తులను పరికించేది.
It was a day on which I felt
I am hapless and hopeless
Never had an iota of hope
That I have in life lot of scope
It was you, my God, flashed in my heart
Clearing all the obstacles that thwart
Filling my heart with all courage
Hallowing my heart with all virtual storage
Chilling my mind which was in summer May
I say now with stretched heart come what may
Oh God Never knew I could feel like this
Like I´ve never seen the sky before
I love you and live with dignity till the end
My season changed fro autumn to spring
My temper swelled up with enormous upswing
I can make all impediments wobbling
Come what may and come what may
I can say now come what may
స్వస్తి.
Comments
Post a Comment