సమస్య మనది -- సలహా గీతది -- 12
సమస్య మనది -- సలహా గీతది
-- 12
https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/11/12.html
సమస్య :అధర్మం పెరిగిపొతూంది. అకారణ వైరాలు పెరిగిపోతున్నాయి. తాము చీకాకు
పడి లోకాన్ని కూడా చీకాకు పెడుతున్నారు. బాధ్యతను భరించి నిలువడమా లేక బాధ్యతకు భయపడి పారిపోవడమా ?
సలహా : దేనికయినా ఒక
స్థితిస్థాపకత (Extreme Elastic
Nature, Breaking Stress) వుంటుంది. పరిస్థితులు ఆ తటమును చేరినపుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుటకు తానె
పుడతానన్నాడు పరమాత్మ. కావున ఆభారము ఆయనపైన వేసేస్తే సరిపోతుంది. ఇక చీకాకు
విషయమునకొస్తే రాత్రి సమయములో వెలిగే వీధి దీపాలు గుర్తుకు వస్తాయి నాకు. ఎందుకంటే
పగలు ముగియగానే చీకటి రాను రానూ దట్టముగా అలముకోనుట ప్రారంభామవుతూ వస్తుంది. ఆ సమయములో వీధి దీపములు వెలుగుట ప్రారంభమౌతుంది. అన్నీ వెలిగినాయనుకో
వీధి మొత్తము వెలుగుతో నిండి నడచుటకు ఆటంకము లేకుండా చేస్తుంది. చెదురు మదురుగా
కొన్ని దీపములు వెలుగలేదనుకో ఆ ప్రదేశము న మసక చీకటి ఆవహించుతుంది. నడచేవాని నడక వేగమూ
తగ్గుతుంది. దీనివలన మనకు ఏమి తెలియవస్తూవుంది? మనము లేక మనకుతుమ్బము ఒక Light Pole అనుకొంటే, మన Light వెలిగితే ఆ వెలుతురు చేరగలిగిన పర్ది వరకు వెలుగు నిమ్పినట్లవుతుంది.
దానివలన Light Pole యొక్క ఉనికి తెలుస్తూ వుంది, బాటసారులకు వెలుగూ
పంచుతూవుంది. నేను చెప్పదలచుకొన్నది ఏమిటో అర్థమైనదా! నిన్ను నీవు చక్కబెట్టుకొంటే
సమాజము దానికదే చక్కబడుతుంది. ‘తనకంపు తనకింపు, పరుల కంపు పాపిష్టి కంపు’
అనుకొంటేనే ఇబ్బంది
వచ్చేది. మనకు కావలసినది చెప్పే నేత కాదు, చేసే చేత కావలసినది.
ఈ విషయమును ఒకసారి
గమనించు.ఈ జగమనేది ఒక ' సర్కసు ' అందులో ఎవరి సన్నివేశము వారిదే . అందులోనూ ఎవరి పాత్ర వారిదే. నీ
ప్రమేయము అందులో వచ్చే వరకు నీవు కూడా ప్రేక్షకునివే. నీ పాత్ర ప్రకటమయ్యేవరకు
నీవు చేస్తూవుండేదేమీ లేదు. చూస్తూ వుండేది తప్ప. మరి నీ ప్రమేయము కల్గినపుడు నీవు
పారిపోతానంటే సమంజసమా ! నీపని నీవు చేస్తే ఈ జగానికే వన్నె తెచ్చిన వాడివౌతావు . అది నీకూ పేరు ప్రఖ్యాతిని అజరామర కీర్తిని తెచ్చి పెడుతుంది. ‘నీ
బాధ్యత నీ ధర్మం’ అదే విధంగా ‘నీ ధర్మం నీ బాధ్యత’.
బాధ్యతకు భయపడి ఎంతదూరమని
పారిపోగలవు. ఒకబాధ్యతను వదలి పారిపోతే అక్కడ వేరొక బాధ్యత తగులుకొంతుంది. ప్రాణము
ఉన్నంతవరకు బాధ్యత తప్పదు. నీదగు బాధ్యత నీవు స్వీకరించు. అదే నీ ధర్మము. నీ
ప్రయోజకత్వమును నిరూపించుటకు తనకు తానుగా నీకు దొరకిన మార్గమని దానిని భావించు. ఈ
సందర్భములో నేను వ్రాసిన ఈ పద్య భావమును ఆకళింపు చేసుకొన్నావంటే నీ భయము బరువు
రెండూ తీరుతాయి.
చేతను బూనియున్నపని
చిన్నదియైనను పెద్దదైనయున్
రాతను దూరబోకు కన రాదని
దానిని చేయు
మార్గమున్
ఊతమునిచ్చితాను హరి ఊరట
గూర్చును నీదు బుద్ధికిన్
చేతులు మోడ్చి నీ మనసు
చేర్చిన ఆయన పాదదోయిపై
ఈ సందర్భంగా శ్రీ
కృష్ణుడు అర్జనునకు ఏమి చెబుతున్నాడో చూస్తాము.
స్వధర్మమపి చావేక్ష్య న
వికంపితుమర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్రేయో 'న్యత్
క్షత్రియస్య న విద్యతే 31- 2 ఉన్నది
ఉన్నది స్వధర్మ మన్నది
నీకడ
భయము చెందకది బాధ్యత
నీయది
ధర్మ యుద్ధమే ధర
క్షత్రియునకు
శ్రీవిలసన్మయ
శ్రేయోమార్గము 31- 2
ఆత్మను గూర్చి దాని
అమృతత్వమును గూర్చి మొదట తెలిపి అర్జనుని కది అర్థమైన పిదప అతనిని కార్యోన్ముఖుని
చేయ మొదలిడినాడు శ్రీ కృష్ణుడు. దీనినే సంభాషణా చాతుర్యము అంటారు.ఇంగ్లీషులో Conversational Skills అంటారు . విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి
విక్రమః ।
యశసి చాభిరుచిర్వ్యసనం
శ్రుతౌ
ప్రకృతి సిద్ధమిదం హి
మహాత్మనామ్ ॥
మహానీయుడు భర్తృహరి
వ్రాసిన పై సుభాషిత భావముమునకు 'తెనుగుసేత' చేసిన ఏనుగు లక్ష్మణకవి గారి మాటల్లో
ఆపదలందు ధైర్యగుణమంచిత
సంపదలందు దాల్మియున్
భూప సభాన్తరాళమున పుష్కల
వాక్చాతురత్వమాజి బా
హాపటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యా యందు వాం
ఛాపరి వృత్తియున్ ప్రకృతి
జన్య గుణంబులు సజ్జనాళికిన్
ఆపదల యందు ధైర్యము, కలిమి కలిగినపుడు ఓర్పు అంటే డబ్బు చేతికొచ్చినదనే అహంకారము , మహా సభలు సదస్సుల యందు వాక్చాతుర్యము, యుద్ధము నందు
పరాక్రమము, కీర్తి యందు అనురక్తియు, వేదశాస్త్ర అధ్యయనమున ఆసక్తియు కలిగి యుండుట అనునవి సజ్జనులకు సహజ
గుణములు.
పరమాత్ముడైన శ్రీ
కృష్ణునిలో ఈ గుణాలన్నీ చూస్తాము. అందుకే ఆయన భగవంతుడు. ఇప్పుడు అర్జనునికి తన
ధర్మమూ, విధి, బాధ్యత ,కర్తవ్యమును బోధజేసి యుద్ధోన్ముఖుని చేస్తున్నాడు.
ఇక్కడ ధర్మము బాధ్యత
వాక్చతురత అన్న మూడు విషయములను శ్రద్ధతో మనము గ్రహించితే పరిస్థితులకు భయపడి
పారిపోయే అవసరముండదు. నీకిచ్చిన బాధ్యతను మనసుతో గ్రహించు. అదే నీ కర్తవ్యము.
దానిని పరిపూర్తి చేయుటకు నీ మాట ముఖ్యమని గ్రహించు.
నాలుక వైరుల కూర్చును
నాలుకయే సన్నిహితుల నయముగ
చేర్చున్
నాలుక నదుపున నుంచిన
నాలుగు దిక్కులును నీవె నాయక రామా!
కావున నీ నాలుకను అదుపున
ఉంచుకొని అవసరమైనపుడు అవసరమైన రీతిలో అవసరమైనంత మాటలాడినావంటే అందరూ నీ ఆప్తులే.
నీ చేరువ కాలేకపోయినారంటే తప్పక వారు మూర్ఖులని గ్రహించు. వారు నీ చెంతనుండీ
ఉపయోగముండదు. వదిలిపెట్టు.
He who knows not and
knows not he knows not is a fool, shun him. అన్నది ఒక ఆంగ్ల సామెత. దానిని అమలుచేయి అంతే!
స్వస్తి.
Venkata Ravisundar Komandur Sir very nicely clubbing
Githa for the PSYCOLOGY&MANAGERIAL
&ADMINISTRATIVE
NEEDY WORDS OF "CONVERSATIONAL SKILLS" IS REALLY GIVING TIMELY
COUNSELLING/motivating COUNTERING TIMELY. SUPER SIR.
Comments
Post a Comment