సమస్య మనది -- సలహా గీతది -- 8

 

సమస్య మనది -- సలహా గీతది --  8

https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/08/8.html


సమస్య : లోకములో ఒకడు వేరోకడిని చంపుతూ వున్నట్లు వ్యవహారము వుంది.ఇది నిజమా ? ఆత్మకు చావు లేదంటారు కదా ?


సలహా : ఆత్మకు చావు వున్నదని ఎవరన్నారు? ఆత్మే పరమాత్మ యని అందరిలో అదే వుండేదియని గ్రహిస్తే ఈ కక్షలు కార్పణ్యాలు వైషమ్యాలు వైరుధ్యాలు ద్వేషానురాగాలు అన్న ద్వంద్వాలకు అతీతమై శాంతియుత సహజీవనము కొనసాగించరా ! ఆత్మ దేహి నుండి విడిపడటానికి కారణము కావలె కదా! నిందే లేనిదే బొందె పోదంటారు కదా ! కర్మ ఫలితముల ననుభవించుతూ ఏర్పడిన బొందె తదనుగుణముగానే ఆత్మను విడుదల చేస్తుంది. అసలు అందరిలో వుండేది అదే ఆత్మ అన్న  ఒక్క నిర్ధారణ ఈ విశ్వాన్నే ఎంతో సురక్షితముగా ఉంచ గలుగుతుంది. ఇది లౌకికమైన ఆలోచన. నీటిలో ఏర్పడే నీటి బుడగలు ఒక్కొక్కసారి ఒకదానితో నొకటి తగిలి పగిలి పోవుట గమనించుతాము. పగలనంత వరకు అవి విడి విడిగానే వుంటాయి. విడిగా ఉంటూ కూడా పగిలి పోతాయి. పగిలిన పిదప ఎక్కడికి పోతున్నాయి . తిరిగీ నీళ్ళలో నికే గదా . వేరు వేరు అనుకొనే  ఈ ఆత్మలు కూడా అంతే. గాజు పట్టకము గుండా పోయే వెలుగు రేఖ ఒకటే . కానీ అదే ఏడు రంగులుగా మారుతూ వుంది. మరి పట్టకము తీసివేస్తే  వెలుగు రేఖ ఒకటే. ఆత్మా కూడా అంతే.

ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఈ విధముగా చెబుతున్నాడు:


య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మాన్యతే హతం

ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే    19 - 2 


చచ్చేదెవ్వరు చంపేదెవ్వరు

ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన 

ఆత్మయే  కదా అందున వున్నది

అది తెలియుము అపుడంతా సుఖమే                   19 - 2 


తనను హతునిగా నొకడు భావించితే తనను హంతకునిగా వేరొకడు భావించుచున్నాడు. రెండూ అస్మంజస 


భావనలే. రెండు శరీరలనుండి ఆత్మ విడి పడుతూ వుంది. కక్షలు కాయమునకే గానీ కనిపించని ఆత్మకు కాదు. ఆ ఆత్మను గుర్తించితే అంతకు మించిన ఆనందమేముంటుంది. 

Comments

Popular posts from this blog

సమస్య మనది -- సలహా గీతది -- 14

సమస్య మనది -- సలహా గీతది -- 11

సమస్య మనది -- సలహా గీతది -- 10