సమస్య మనది -- సలహా గీతది -- 7
సమస్య మనది -- సలహా గీతది -- 7
https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/08/7.html
సలహా : గురికానివారుంటారు. వారు
ఆవిధముగా ఉండుటకొరకు అకుంఠిత మైన సాధన చేసినవారు. నీవు ఆ దీక్ష వహించితే నీకూ
మోక్షపదము తప్పదు. నిజము చెప్పవలసి వస్తే ఇవి లేనివారెవ్వరు.
తేడా అంతా అవి సహించడములోనే. లోహములు అనేవంతా ఒక
వర్గముగా తీసుకొంటే ఒక్కొక్క లోహము ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవించుతుంది .
అంటే సహన శక్తి మారుతూ వుంటుంది ఒక్కొక్క లోహానికి.
అవి నిర్జీవాలు . వాని గుణములు మారవు . మనము జీవులము మనలో వయసు పెరిగే కొద్దీ
శారీరిక మానసిక మార్పులు కుప్పలు తెప్పలు. మన
పురోగమనము పరమాత్ముని వైపే అయితే మన సహన సౌశీల్యములను పెంచుకొంటేనే కదా, పోగలిగేది. కాబట్టి
కార్య ఫలితములకు పొంగక క్రుంగక ఉండటమే
ధీర లక్షణము . అదే అమృతత్వపు దారిని జేర్చేది క్షణక్షణము.
భగవానుడైన శ్రీ కృష్ణుడు
ఈ విషయమై ఏమంటున్నాడో గమనించండి :
యంహినః వ్యతయన్త్యేతే పురుషం
పురుషర్షభ
సమదుఃఖ సుఖం ధీరం సో'మృతత్వాయ
కల్పతే 15
- 2
సుఖ దుఃఖమ్ములు సోదర జాతలు
స్థిరములు కావవి స్థిమితము పొందుము
సమ దృక్పథమే సాధన సుపధము
-2 దివ్యత్వమ్మును
ధీరుడు
పొందగ 15
- 2
కృష్ణుడు ఎక్కడా ద్వంద్వా తీతము,
అంటే సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, శీతోష్ణాలు , మమకారవికారాలు, బంధ విబంధాలు మొదలయిన
దేనికీ అతీతముగా వుండమనుట లేదు. వానిని అనుభవించుతూనే నీటిపై తేలే నేతిచుక్క లా
ఉండమని ఉపదేశము. నేతిచుక్కే ఎందుకు అంటే కరిగిన
నేతిబొట్టు నీటిలో పడుతూనే నీటితో
కలిసినట్లుంటుంది. కాసేపటి తరువాత గనీభవించి అంటియుంటూ
కూడా అంటనట్లే వుంటుంది. మనము కూడా
నేర్చుకోవలసినది అదే. 'కృషితో
నాస్తి దుర్భక్షం' 'సాధనమున
పనులు సమకూరు
ధర లోన' అన్నారు
పెద్దలు .
శుభస్య శీఘ్రం.
Comments
Post a Comment