సమస్య మనది -- సలహా గీతది -- 10
సమస్య మనది -- సలహా గీతది -- 10 https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/09/10.html సమస్య : ఆత్మ నశ్వరమని ఎంత సమాధాన పరచుకొన్నా , నాకత్యంత ఆప్తులు పరమపదిస్తే వారి ప్రేమాభిమానాలను మరచి పోలేక పోవుచున్నాను ? సలహా : వెర్రి వాడా . చెలగ జలధి నీ జీవిత రంగము కన నీవేమో కడలి తరంగము పైకెగసినచో పడక తప్పదు కడలి తోడనే కలువక తప్పదు నీదగు పుట్టుక నిమిత్త మాత్రము నీట కలుపుమా నీదగు ఆత్రము నీ మెయి నీదగు కర్మల పాత్రము నిజము నెరుగు మిది నిశ్చల సూత్రము మనిషికి మూడు శరీరాలునాయి. అవి స్థూల , సూక్ష్మ , కారణ శరీరాలు. స్థూల శరీరము రక్తమాంసాది దాటు నిర్మితము. సూక్ష్మ దేహము సూక్ష్మేంద్రియ అంతఃకరణ సమన్వితము . కారణ శరీరము వాసనా భరితము. ఈ మూడు శరీరాలకు ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యము చెందదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా స్వ ప్రకాశ రూప రూపమై కర్తగా కానీ , భోక్తగా కానీ కాకుండా అన్నింటికీ చైతన్యాన్నిచ్చే ఆత్మా యే మహా కారణ శరీరంగా చెప్పబడింది.ఇది గాఢ నిద్రలో అనుభవానికి వచ్చే ...